Weather | హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తేతెలంగాణ): దేశవ్యాప్తంగా ఈ ఏడాది తీవ్ర వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలు ఎదురయ్యాయని భారత వాతావరణ, విపత్తు నిర్వహణ విభాగం వెల్లడించింది. తాజాగా డౌన్ టు ఎర్త్ రూపొందించిన ైక్లెమెట్ ఇండియా 2024 నివేదిక ఈ విషయాన్ని నివేదించింది. దేశవ్యాప్తంగా జనవరి నుంచి సెప్టెంబరు వరకు సేకరించిన తీవ్ర వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వానలు, వరదలు, ఉరుములతో కూడిన పిడుగులు వంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. 2023లో తెలంగాణలో 52 రోజులు తీవ్రమైన వాతావరణం చోటుచేసుకున్నట్టు నివేదిక తెలిపింది.
దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా 66 మంది వ్యక్తులు, 4,350 జంతువుల మరణాలకు దారితీసిందని నివేదిక వెల్లడించింది. వీటితోపాటు పంటలు, మౌలిక సదుపాయాలకు భారీగా నష్టం వాటిల్లిందని పేర్కొన్నది. ఉరుములుతో కూడిన ఎడతెగని వర్షాలు, వరదలు కూడా పంటలు, మౌలిక సదుపాయాలకు తీరని నష్టం వాటిల్లింది. ఈ కాలంలో తెలంగాణ 50 రోజుల్లో తీవ్ర వాతావరణాన్ని ఎదురొన్నదని నివేదిక తెలిపింది. ఒక ఆగస్ట్ నెలలోనే 32 వేల హెక్టార్లకు పైగా పంట భూమి దెబ్బతిన్నట్టు గుర్తించింది. తొమ్మిది నెలల్లో దాదాపు 73,500 హెక్టార్లు నష్టపోయాయని నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో సంభవించిన గృహ నష్టం విషయంలో తెలంగాణలో తక్కువ గృహ నష్టం జరిగిందని నివేదిక పేర్కొన్నది.
255 రోజులు తీవ్ర వాతావరణం
దేశవ్యాప్తంగా 274 రోజుల్లో 255 రోజులు తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొన్నట్టు డౌన్ టు ఎర్త్ ైక్లెమెట్ ఇండియా 2024 నివేదిక తెలిపింది. మధ్యప్రదేశ్, అస్సాం, కేరళ వంటి తీవ్రంగా దెబ్బతిన్న రాష్ట్రాలు 100 రోజుల తీవ్ర వాతావరణ అంతరాయాలను అధిగమించాయని వెల్లడించింది. తెలంగాణ, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలతో సహా విస్తృత దక్షిణ ద్వీపకల్పం అంతటా ఈ ఏడాది 168 రోజులు తీవ్రమైన వాతావరణ సంఘటనలతో 4,25,000 హెక్టార్ల వ్యవసాయ భూమి దెబ్బతిన్నదని తేలింది. 113 రోజుల విపరీతమైన పరిస్థితులతో కేరళ తీవ్ర ఇబ్బందులను ఎదురొన్నట్టు గణాంకాలు వెల్లడించాయి.