హైదరాబాద్, నవంబర్18 (నమస్తే తెలంగాణ) : చేనేత కార్మికుల చేయూత పథకానికి సంబంధించి ప్రభుత్వం రూ.50 కోట్లను మంజూరు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. చేనేత చేయూత స్కీమ్‌కు ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ.450కోట్లను ప్రతిపాదించగా, ఇప్పటికే రూ.37.49 కోట్ల ను విడుదల చేసింది.
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : ఆగ్నేయ బంగాళాఖాతం లో ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడనున్నట్టు భారత వాతావరణశాఖ తెలిపింది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో, దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. తెలంగాణలో గరిష్ఠంగా 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని, తేమ శాతం తెలంగాణలో 40 కంటే తకువ ఉంటుందని చెప్పారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో 15 డిగ్రీల కంటే తకువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు చెప్పారు.