చేనేత కార్మికులకు ఆసరాగా నిలిచే పొదుపు పథకంలో కాంగ్రెస్ ప్రభుత్వం కోతలు పెట్టింది. అనుబంధ కార్మికుల చెల్లింపుల వాటా కుదించింది. గతానికి భిన్నంగా అనుబంధ కార్మికుడిని ఒకరికే పరిమితం చేసింది.
చేనేత కార్మికుల చేయూత పథకానికి సంబంధించి ప్రభుత్వం రూ.50 కోట్లను మంజూరు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. చేనేత చేయూత స్కీమ్‌కు ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ.450కోట్లను ప్రతిపాదించగా,