హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ప్రమాదవశాత్తు చేయిని పూర్తిగా కో ల్పోయి, దవాఖానలో చికిత్స పొందిన నిరుపేద రైతును ఎంపీ డాక్టర్ జీ రంజిత్‌రెడ్డి ఆదుకున్నారు. సీఎం సహాయనిధి నుంచి రూ.5లక్షలు మంజూరు చేయించి ఆర్థిక చేయూతను అందించారు. వికారాబాద్ జిల్లా షాబాద్ మండలం దోస్వాడ గ్రామానికి చెందిన బాల్‌రెడ్డి అనే రైతు ఓ ప్రమాదంలో చేయిని కోల్పోయాడు. అప్పు లు చేసి దవాఖానలో చికిత్స పొందాడు. బాల్‌రెడ్డి దీనస్థితిని స్థానిక జడ్పీటీసీ అవినాశ్‌రెడ్డి, సర్పంచ్ వెంకటేశ్రెడ్డితో కలిసి ఎంపీ రంజిత్‌రెడ్డి దృష్టికితీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎంపీ సీఎం సహాయనిధి కింద రూ.5 లక్షలు మంజూ రు చేయించారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఏర్పాటు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన బాల్రెడ్డికి రంజిత్‌రెడ్డి శాలువా కప్పి చెక్కును అందజేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావంతో ప్రతి పౌరుడికి శాలువా కప్పి సన్మానించే రోజు వచ్చిందని రంజిత్‌రెడ్డి పేర్కొన్నారు.