హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎన్నికల బరిలో అత్యధికంగా 48 మంది ఎల్బీనగర్ నుంచి బరిలో ఉన్నారు. గజ్వేల్లో 44 మంది, కామారెడ్డి, మునుగోడులో 39 మంది చొప్పు న, పాలేరులో 37 మంది పోటీలో ఉన్నారు. నాంపల్లి, కోదాడలో 34 మంది చొప్పున, మల్కాజిగిరిలో 33 మంది, ఖమ్మం, ఉప్పల్లో 32 మంది చొప్పున బరిలో నిలిచారు. అతి తక్కువగా నారాయణపేట, బాన్సువాడల్లో ఏడుగురు చొప్పున ఉండగా, బాల్కొండలో ఎనిమిది మంది, బోథ్, కంటోన్మెంట్లో 10 మంది చొప్పున పోటీ చేస్తున్నారు.