Jubilee Hills By Poll | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 48.24 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పురుషులు 47.59 శాతం మంది, మహిళలు 48.95 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత ఎన్నికలను పరిశీలిస్తే.. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 52.76 శాతం, 2014లో 50.18 శాతం, 2018లో 45.59 శాతం, 2023లో 47.58 శాతం పోలింగ్ నమోదైంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 4,01,365 ఓటర్లు, ఇందులో పురుషులు 2,08,561 మంది, మహిళలు 1,92,779 మంది ఉన్నారు.