హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): కొడంగల్ ఏరియా అభివృద్ధి అథారిటీ (కాడా)కి రాష్ట్ర ప్రభుత్వం రూ.43.75 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.
కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం కాడా చైర్మన్, వికారాబాద్ కలెక్టర్‌కు రూ.43.75 కోట్లు విడుదలయ్యాయి. కాడా పథకం కోసం 2024-25 బడ్జెట్లో ప్రతిపాదించిన నిధుల నుంచి ఈ మొత్తం విడుదల చేశారు.