Special Trains | హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో కాచిగూడ-తిరుపతి, సికింద్రాబాద్-తిరుపతి మధ్య 42 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు గురువారం రైల్వే అధికారులు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 16 వరకు ఈ రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయని పేర్కొన్నారు. కాగా, హైదరాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో కాచిగూడ-నిజామాబాద్, మేడ్చల్-లింగంపల్లి, మేడ్చల్-సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య 12 రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు. అక్టోబర్ 1 నుంచి 31 వరకు రైళ్ల రద్దు కొనసాగుతుందన్నారు.