హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందేనని గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక జీవో తీసుకొచ్చి 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రిజర్వేషన్ బిల్లును బీజేపీ సర్కారు ప్రవేశపెట్టాలని కోరారు. అప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్యలో 10వేల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల(పీఎస్‌హెచ్‌ఎం)పోస్టులను మంజూరుచేసి కామన్ మెరిట్ ప్రకారం పదోన్నతులు కల్పించాలని సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్(ఎస్జీటీయూ) విన్నవించింది.
శుక్రవారం సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహిపాల్‌రెడ్డి, వెంకటేశం సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌ను వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు అందజేశారు.