హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుకు చట్టం చేసి జీవో తెస్తామనడం బీసీల చెవిలో పూలు పెట్టడమేనని తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశంగౌడ్ అభిప్రాయపడ్డారు. 42 శాతం రిజర్వేషన్ల జీవో కోర్టుల్లో నిలవదని చెప్పారు.
అసెంబ్లీలో చట్టం చేసి 50శాతం పరిమితిని ఎత్తివేస్తామని చెప్పడం అవివేకానికి పరాకాష్ఠ అని ఒక ప్రకటనలో విమర్శించారు. పార్లమెంట్లో తీర్మానం చేసి, రాజ్యాంగ సవరణతోనే ఇది సాధ్యమని అన్నారు. స్థానిక పోరులో కాంగ్రెస్ను ఖతం చేస్తామని హెచ్చరించారు.