హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : పీఎం కుసుమ్ పథకంలో భాగంగా రాష్ట్రంలో 4 వేల మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా జీవోను విడుదల చేశారు.
కాంపొనెంట్ – ఏ కింద రైతులు ఖాళీ స్థలాల్లో రెండు మెగావాట్ల వరకు సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుని, గ్రిడ్ కనెక్టివిటీ చేసుకోవచ్చు. స్వయం సహాయక సంఘాలు, రైతు సంఘాలు, రైతు సమాఖ్యలు, మండల సమాఖ్యలు పీఎం కుసుమ్ మార్గదర్శకాలను అనుసరించి ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం సూచించింది.