హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : ఈనెల 28 నుంచి ప్రారంభం కానున్న మేడారం జాతరకు రాష్ట్రవ్యాప్తంగా 4వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో సెక్రటేరియట్లో మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సారి 20 లక్షల మంది జాతర కోసం బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉ న్నదని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మ హిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నట్టు వెల్లడించారు.
వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, హైదరాబాద్ నుంచి 51 ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లను ఏర్పాటు చేసిన ట్టు తెలిపారు. 50 ఎకరాల్లో బస్‌స్టేషన్, 9 కిలోమీటర్లుండే 50 క్యూలల్లో 20 వేల మంది ఉండేలా చర్యలు చేప ట్టినట్టు వెల్లడించారు. మేడారం, కా మారం ప్రాంతాల్లో వెయ్యి బస్సుల పారింగ్కు 25.76 ఎకరాల విస్తీర్ణం లో సదుపాయాన్ని కల్పించినట్టు పే ర్కొన్నారు. తాతాలిక బస్‌స్టేషన్‌లో 76 సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానమై ఉంటాయని తెలిపారు.