40 బీసీ కులాలను ఓబీసీల్లో చేర్చాలి
తెలంగాణ లోని వీరశైవ లింగాయత్, లింగ బలిజసహా తెలంగాణలోని 40 బీసీ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చా లని రాష్ట్ర ఎంపీలు బీబీ పాటిల్, ఆర్ కృష్ణయ్య, కే లక్ష్మణ్, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ డిమాండ్ చేశారు.
- ఎంపీలు బీబీ పాటిల్, ఆర్ కృష్ణయ్య, కే లక్ష్మణ్ డిమాండ్
- ఢిల్లీలో బీసీ కమిషన్ చైర్మన్ ఆధ్వర్యంలో జరిగిన విచారణకు హాజరు
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ లోని వీరశైవ లింగాయత్, లింగ బలిజసహా తెలంగాణలోని 40 బీసీ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చా లని రాష్ట్ర ఎంపీలు బీబీ పాటిల్, ఆర్ కృష్ణయ్య, కే లక్ష్మణ్, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ డిమాండ్ చేశారు. మంగళవారం ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్‌రాజ్ గంగారాం అహీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ విచారణకు సంబంధిత అధికారులతో కలిసి వారు హాజరయ్యారు. ఆయా కులాలకు సంబంధించిన ఆధారాలను జాతీయ బీసీ కమిషన్‌కు వారు సమర్పించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర బీసీ కమిషన్ వెనుకబడిన కులాలపై లోతుగా అధ్యయనం చేసి వారి స్థితిగతులను తెలు సుకొని ఇప్పటికే పలుమార్లు నివేదిక ఇచ్చినట్టు తెలిపారు. కేంద్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా ఆయా బీసీ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చడంపై ముందడుగు పడటం లేదని వారు గుర్తు చేశారు. 14 ఏండ్లుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యో గాల్లో, విద్యా అవకా శాల్లో, కేంద్ర పథకాల్లో ఆయా వర్గాలకు అన్యాయం జరుగుతున్న దని వివరించారు. ఆయా కులాలకు ఓబీసీ జాబితాలో చేర్చే విషయమై కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని ఎన్సీబీసీ చైర్మన్ హన్స్‌రాజ్ గంగారాం అహీర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
women cops detain Dipke | అభిజిత్ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

