హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఫీజుల విధివిధానాల ఖరారుకు నాలుగు సబ్ కమిటీలు వేయాలని అధికారుల కమిటీ నిర్ణయించింది. లీగల్, అకడమిక్, మౌలిక వసతుల(ఇన్ఫ్రాస్ట్రక్చర్)కు వేర్వేరుగా సబ్ కమిటీలు వేయాలని నిర్ణయించారు. ఫీజుల విధివిధానాల ఖరారుకు ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సోమవా రం భేటీ అయ్యింది. ఫీజుల ఖరారుకు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు.
ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి నేతృత్వంలో లీగల్ కమిటీ, ఓయూ ప్రొఫెసర్ కృష్ణయ్య నేతృత్వం లో అకడమిక్ సబ్ కమిటీ, డీటీసీపీ డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ, ఆడిట్ డైరెక్టర్ వెంకటేశ్వర్రావు నేతృత్వంలో ఆడిట్ కమిటీని ఏ ర్పాటు చేశారు. ఈ సబ్ కమిటీలు మూడు,నాలుగు రోజుల్లో విధివిధానాలు చేయాలని నిర్ణయించారు.