Padma Awards 2026 | గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఐదుగురిని పద్మ విభూషణ్, 13 మందిని పద్మ భూషణ్, 113 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. మొత్తంగా 131 మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందిని పద్మ పురస్కారాలు వరించాయి. ఏపీ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఏడుగురు పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు. రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వారు ఈ పురస్కారాలు అందుకోనున్నారు.
1. గడ్డె బాబు రాజేంద్ర ప్రసాద్ – కళారంగం – ఆంధ్రప్రదేశ్
2. గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్(మరణానంతరం) – కళారంగం – ఆంధ్రప్రదేశ్
3. మాగంటి మురళీ మోహన్ – కళారంగం – ఆంధ్రప్రదేశ్
4. వెంపటి కుటుంబ శాస్త్రి – సాహిత్యం & విద్య – ఆంధ్రప్రదేశ్
1. గడ్డమానుగు చంద్రమౌళి – శాస్త్ర & సాంకేతికం – తెలంగాణ
2. దీపికా రెడ్డి – కళారంగం – తెలంగాణ
3. గుడూరు వెంకట్రావు – వైద్యం – తెలంగాణ
4. కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణియన్ – శాస్త్ర & సాంకేతికం – తెలంగాణ
5. కుమారస్వామి తంగరాజ్– శాస్త్ర & సాంకేతికం – తెలంగాణ
6. విజయ్ ఆనంద్ రెడ్డి – వైద్యం – తెలంగాణ
7. మామిడి రామారెడ్డి (మరణానంతరం) – పశుపోషణ – తెలంగాణ