శంషాబాద్ రూరల్, జూలై 2: వాతావరణం అనుకూలించని కారణంగా శంషాబా ద్ ఎయిర్పోర్టుకు వచ్చే నాలుగు విమానాలను దారిమళ్లించినట్టు జీఎంఆర్ ప్రతినిధులు బుధవారం తెలిపారు.
మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో శంషాబాద్ ఎయిర్పోర్టులో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో బెంగళూరు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చే విమానాన్ని విజయవాడకు మళ్లించినట్టు తెలిపారు.