హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ) : ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 4.2 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 892 పరీక్షా కేంద్రాలను ఇంటర్‌బోర్డు అధికారులు ఏర్పాటు చేశారు.
ఈనెల 22 నుంచి 29 వరకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం ఫస్టియర్, మధ్యాహ్నం సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు.