హైదరాబాద్: రాష్రంలో ఉద్యోగాల జాతర ప్రారంభమైంది. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నామని సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు. ఇందులో 39,829 పోస్టులు జిల్లాల్లో ఖాళీగా ఉన్నాయని, వాటిని నేరుగా భర్తీ చేస్తామన్నారు. వాటికి సంబంధించిన నియామక ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తున్నామని చెప్పారు. జిల్లాల్లో అత్యధికంగా హైదరాబాద్లో 5,268 ఖాళీలు ఉండగా, 1,976 పోస్టులతో నిజామాబాద్, 1769 పోస్టులతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక అతి తక్కువగా వనపర్తి జిల్లాలో 556 పోస్టులు ఉండగా, రాజన్న సిరిసిల్లాలో 601 ఖాళీలు ఉన్నాయి.
హైదరాబాద్ – 5,268
నిజామాబాద్- 1,976
మేడ్చల్ మల్కాజ్గిరి- 1,769
రంగారెడ్డి- 1,561
కరీంనగర్- 1,465
నల్లగొండ- 1,398
కామారెడ్డి- 1,340
ఖమ్మం- 1,340
భద్రాద్రి కొత్తగూడెం- 1,316
నాగర్కర్నూల్- 1,257
సంగారెడ్డి- 1,243
మహబూబ్నగర్- 1,213
ఆదిలాబాద్- 1,193
సిద్దిపేట- 1,178
మహబూబాబాద్- 1,172
హనుమకొండ- 1,157
మెదక్- 1,149
జగిత్యాల- 1,063
మంచిర్యాల- 1,025
యాదాద్రి భువనగిరి- 1,010
జయశంకర్ భూపాలపల్లి- 918
నిర్మల్- 876
వరంగల్- 842
కుమ్రం భీం ఆసీఫాబాద్- 825
పెద్దపల్లి- 800
జనగాం- 760
నారాయణపేట్- 741
వికారాబాద్- 738
సూర్యాపేట- 719
ములుగు- 696
జోగులాంబ గద్వాల- 662
రాజన్న సిరిసిల్లా- 601
వనపర్తి- 556