హైదరాబాద్, ఆగస్టు19 (నమస్తే తెలంగాణ): హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో సరైన వసతులు లేక, కలుషిత ఆహారం బారినపడి 36మంది విద్యార్థులు ఇప్పటికే చనిపోయారని, 800మంది అనారోగ్యానికి గురయ్యారని, ఇకనైనా మెస్‌చార్జీలను పెంచాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థి సంఘం నేతలు రామకృష్ణ, రాజేందర్, రామ్మూర్తితో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సెక్రటేరియట్లో సోమవారం వినతిపత్రం అందజేశారు. అమ్మాయిలకు పాకెట్‌మనీ రూ.1000 ఇవ్వాలని, గురుకులాలు, హాస్టళ్లలో వసతులను మెరుగుపరచాలని విజ్ఞప్తిచేశారు. ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు.