Singareni | సింగరేణి ఉద్యోగులకు ప్రభుత్వం లాభాల్లో వాటా ప్రకటించింది. ఒక్కో కార్మికుడికి సగటున రూ.1.90లక్షల బోనస్ ఇవ్వనున్నది. గతేడాది కంటే రూ.20వేలు అదనంగా సింగరేణి యాజమాన్యం కార్మికులకు బోనస్ ఇవ్వనున్నది. సింగరేణి చరిత్రలో తొలిసారిగా ఒప్పంద కార్మికులకు సైతం బోనస్ ఇస్తున్నది. ఒప్పంద కార్మికులకు రూ.5వేల చొప్పున బోనస్ ఇవ్వనున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సింగరేనికి రూ.4,701కోట్ల లాభం వచ్చింది. ఈ క్రమంలో కార్మికులకు ప్రభుత్వం 33శాతం బోనస్ ప్రకటించింది. గతేడాది కార్మికులకు బోనస్‌గా రూ.1.70లక్షలు బోనస్ రాగా.. ఈసారి రూ.20వేలు అదనంగా అందనున్నది.