హైదరాబాద్: రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించారు. రాష్ట్రంలో 80,039 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి నియామక ప్రక్రియను వెంటనే చేపడుతున్నామని శాసనసభలో ముఖ్యమంత్రి చెప్పారు. ఇందులో జోన్లు, మల్టీ జోన్లలో 32,036 ఖాళీలు ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్రంలోని ఏడు జోన్లలో 18,866 ఖాళీలు ఉండగా, మల్టీ జోన్లలో 13,170 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు..
కాళేశ్వరం జోన్లో- 1,630 (కుమ్రం భీం అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలు)
బాసర జోన్- 2,328 (ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు)
రాజన్న జోన్- 2,403 (కరీంనగర్, సిరిసిల్లా – రాజన్న, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలు)
భద్రాద్రి జోన్- 2,858 (కొత్తగూడెం భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, హనుమకొండ జిల్లాలు)
యాదాద్రి జోన్- 2,160 (సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగాం జిల్లాలు)
చార్మినార్ జోన్- 5,297 (మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు)
జోగులాంబ జోన్- 2,190 (మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలు)
మల్టీజోన్‌లో మొత్తం 13,170 పోస్టులు ఉన్నాయి.
మల్టీజోన్ 1- 6,800 (కాళేశ్వరం జోన్, బాసర జోన్, రాజన్న జోన్, భద్రాద్రి జోన్)
మల్టీజోన్ 2- 6,370 (యాదాద్రి జోన్, చార్మినార్ జోన్, జోగులాంబ జోన్)