హైదరాబాద్, జనవరి 27(నమస్తే తెలంగాణ): తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం త్వరలో ఓ విజన్ డాక్యుమెంట్‌ను తేనున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపా రు. ఇందులోభాగంగా తెలంగాణ మెగా మాస్టర్‌ప్లాన్-2050ని తేవాలని నిర్ణయించామని, దీనికి సం బంధించి త్వరలోనే టెండర్లు ఆహ్వానిస్తామని వెల్లడించారు. రాష్ర్టాభివృద్ధిలో, మెగా మాస్టర్‌ప్లాన్ రూపకల్పనలో బిల్డర్లు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హైటెక్స్‌లో శనివారం జరిగిన 31వ ఆల్ ఇండియా బిల్డర్స్ కన్వెన్షన్‌లో రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
సీఎం మాట్లాడుతూ.. దేశ నిర్మాణంలో బిల్డర్స్ పాత్ర ఎంతో ఉందని అన్నారు. ‘గొర్రె బలిస్తే గొల్లాయనకే లాభం.. అలాగే కాంట్రాక్టర్లు ఆర్థికంగా బలపడితేనే రాష్ట్రం బలపడుతుందని ప్రభు త్వం నమ్ముతున్నది. బిల్డర్లకు సమస్యలు రాకుండా చూస్తాం’ అని చెప్పారు. ఔటర్ లోపల అర్బన్ తెలంగాణ, ఔటర్ నుంచి బయట సబర్బన్ తెలంగాణ, రీజనల్ రింగురోడ్డు వెలుపల నుంచి రాష్ట్ర సరిహద్దు వర కు రూరల్ తెలంగాణ మెగా మాస్టర్‌ప్లాన్-2050ని తేనున్నట్టు తెలిపారు. దీని తయారీకి సంబంధించి త్వరలోనే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ను పిలుస్తామని, బిల్డర్లు పాల్గొనాలని కోరా రు. మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, కోమటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు