DSC 2008 | హైదరాబాద్, ఫిబ్రవరి 11 ( నమస్తే తెలంగాణ): సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలిచ్చే ప్రక్రియ మొదలైంది. వీరి రిక్రూట్మెంట్పై సోమవారం హైకోర్టు సీరియస్ అయిన నేపథ్యంలో ప్రక్రియ ముందుకెళ్లనున్నది. ఇందుకు సంబంధించి బుధ లేదా గురువారం జీవో జారీకానున్నది. దీంతో 1,382 మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నారు.
ఇప్పటికే ఎన్నికల సంఘం సైతం రిక్రూట్మెంట్కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వీరిని సెకండరీ గ్రేడ్ టీచర్స్(ఎస్జీటీ)గా కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేయనున్నారు. ఎస్టీజీ బేసిక్ వేతనం ఇవ్వనున్నారు. హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులు మినహా రూ.31,040 వేతనం అందనున్నది. 33 జిల్లాల ప్రాతిపదికగా నియామకాలు చేపట్టనున్నారు.