బెజ్జూర్, మార్చి 26 : హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం కుకుడ, మర్తిడి, పాపన్పేట, గబ్బాయి, తలాయి, సోమిని, మొగవెళ్లి గ్రామాల్లో ఆయన పర్యటించి, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలంతా మళ్లీ బీఆర్ఎస్ సర్కారే రావాలని, కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేస్తామని హామీ ఇస్తున్నారన్నారు. కుకుడలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ఆత్రం హరీశ్ ఆధ్వర్యంలో 30 మంది యువకులు ఆర్ఎస్పీ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఆర్ఎస్పీ గులాబీ కుండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.