కరీంనగర్: జిల్లాలోని తిమ్మాపూర్ మండలంలో పెద్ద ప్రమాదం తప్పింది. మండలంలోని ఇందిరానగర్ వద్ద ఓ పెండ్లి బస్సు.. లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. పెండ్లి బస్సు జిల్లాలోని వెదురుగట్ట నుంచి హైదరాబాద్ వెళ్తున్నది. ఈ క్రమంలో ఇందిరానగర్ వద్ద లారీని ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను కరీంనగర్ దవాఖానకు తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.