
యాదాద్రి భువనగిరి : బొమ్మలరామారం మండలం చీకటిమామిడి వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు – కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కారు ఈసీఐఎల్ నుంచి తుర్కపల్లి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.