Accident | ఏపీలోని గుంటూరు జిల్లా నల్లపాడు స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అంకిరెడ్డిపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఆగివున్న కారును ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
మృతులను తెలంగాణలోని సూర్యాపేట ప్రాంత వాసులుగా గుర్తించారు. తిరుపతి నుంచి తిరిగొస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రి మార్చూరీకి తరలించారు. మరోవైపు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలో జాతీయ రహదారిపై అదుపుతప్పిన కారు.. డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది.