Road Accident | ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైనథ్ మండలం తరోడా వద్ద జాతీయరహదారిపై అదుపుతప్పి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. మృతులను ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన షేక్ మొయినుద్దీన్, మోయిన్, కీర్తిసాగర్‌గా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని యోగేశ్‌గా గుర్తించారు.