హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): కోల్కతా నుంచి హైదరాబాద్కు స్మగ్లింగ్ చేస్తున్న 3 కోట్ల విలువైన 3 కిలోల 982.25 గ్రాముల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 6న బస్సులో ఇద్దరు వ్యక్తులు నడుముకు ధరించే పట్టీలో బంగారా న్ని తీసుకొస్తుండగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు.
గండిపేటలో స్వచ్ఛంద సేవ
హైదరాబాద్, జూలై 7(నమస్తే తెలంగాణ): చెరువులు, నదులను పరిరక్షించేందుకు దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆదివారం జీహెచ్ఎంసీ సహకారంతో గండిపేట చెరువును శుభ్రం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్లోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యకర్తలతోపాటు ప్రముఖ ఐటీ సంస్థల ఉద్యోగులు, క్వాల్కమ్ డైరెక్టర్ అజయ్ సేథి, ఏఎండీ సంస్థ సీనియర్ డైరక్టర్ శ్రీనివాసన్, మైక్రోసాఫ్ట్ ఉద్యోగి జతిన్, పలు కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు, సీబీఐటీ, ఎంజీఐటీ కాలేజీల విద్యార్థులు, ఈ పరిసరాల్లోని మైహోమ్ నవద్వీప కుటుంబాలవారు కూడా పాల్గొన్నట్టు నిర్వాహకులు తెలిపారు.