Rythu Bharosa | హైదరాబాద్, ఫిబ్రవరి 6(నమస్తే తెలంగాణ) : రైతు భరోసాలో కోతలు నిజమేనని వ్యవసాయ శాఖ అంగీకరించింది. గత వానకాలంతో బీఆర్ఎస్ ఇచ్చిన దానితో పోల్చితే ఈ యాసంగిలో ఎకరంలోపు 3,94, 232 మంది రైతులకు కోత పెట్టినట్టు వెల్లడించింది. ‘రైతులు తగ్గారు.. భూమి పెరిగింది’ శీర్షికన గురువా రం నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనానికి వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి వివరణ ఇచ్చారు.
గత వానకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరం వరకు 22,55,181 మంది రైతులకు చెందిన 12,85,147 ఎకరాలకు రూ.642.57 కోట్లు ఇచ్చినట్టు తెలిపారు. ఈ యాసంగిలో ప్రస్తుతం ఎకరం వరకు 18,60, 949 మంది రైతులకు చెందిన 12, 21,820 ఎకరాలకు రూ. 610.91 కోట్ల రైతు భరోసా అందించినట్లు పేర్కొన్నారు. గతంతో పోల్చితే ఈ యాసంగిలో సర్కారు 3,94,232 మంది రైతులకు కోత విధించగా, 63,327 ఎకరాలకు కోత పెట్టింది.