శంషాబాద్ రూరల్ , మే 1: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. రూ.3.45 కోట్ల విలువైన 3.5 కిలోల పుత్తడిని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారాన్ని తీసుకొస్తున్న ప్రయాణికుడిని, ఇతడికి సహకరించిన ఇద్దరు విమాన సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.