కట్టంగూర్, నవంబర్ 24 : ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఉద్యమాలతోపాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు గుర్తు చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం నల్లగొండ జిల్లా కట్టంగూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చుడో…కేసీఆర్ సచ్చుడో అన్న తెగువతో నాలుగు కోట్ల ప్రజలను ఏకం చేసి.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాజకీయ వ్యవస్థలను ఏకం చేసిన దీక్షా దివస్ ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.
తెలంగాణ వస్తే జైత్రయాత్ర.. లేకుండా నా శవయాత్ర అని నిమ్స్ నుంచే ప్రకటించిన గొప్ప ఉద్యమనేత కేసీఆర్ గుర్తుచేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా మలిదశ తెలంగాణ ఉద్యమానికి తెరలేపారని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్రం మెడలు వంచి స్వరాష్ట్ర లక్ష్యాన్ని నెరవేర్చిన ఆయన సంకల్ప దీక్ష చరిత్రలో చిరస్థాయికి నిలిచియిందని ప్రశంసించారు. నకిరేకల్‌లో 100 పడకల దవాఖాన, అయిటిపాముల లిఫ్ట్ట్ ఇరిగేషన్, సెంట్రల్ లైటింగ్, డివైడర్స్తోపాటు ప్రధాన కూడళ్ల వద్ద ఆయా మండలాల పార్టీ శ్రేణులు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం, పండ్లు పంపిణీ చేయాలని సూచించారు.