హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో 2,800 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని ఆర్టీసీ యోచిస్తున్నదని, దీనిపై ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడరీతో చర్చించామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
‘బజాజ్ గోగో’ సంస్థ కొత్తగా ఆవిష్కరించిన ఎలక్ట్రిక్ ఆటోలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం తో ఆటో డ్రైవర్లు ఇబ్బందిపడుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తెలిపారు.