హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా 28బార్లకు నోటిఫికేషన్ ఇచ్చిన ఎక్సైజ్‌శాఖ.. శుక్రవారం డ్రా పద్ధతిలో కేటాయించనున్నది. జీహెచ్ఎంసీ పరిధిలో 24 బార్లు ఉండగా, 3,520 దరఖాస్తులు వచ్చాయి.
సరూర్‌నగర్‌లో జల్పల్లి మున్సిపాలిటీ బార్‌కు 57, మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ బార్‌కు 49, నిజామాబాద్, బోధన్‌లో 42 దరఖాస్తులు వచ్చాయి. వాటికి ఆయా జిల్లాల కలెక్టరేట్ పరిధిలో డ్రా తీయనున్నారు.