Nagarjunasagar | గద్వాల/అయిజ/శ్రీశైలం/నందికొండ, ఆగ స్టు 29: కృష్ణా ప్రాజెక్టులకు మళ్లీ వరద పెరిగింది. గురువారం జూరాల డ్యాంకు ఇన్‌ఫ్లో 2,94,000 కూసెక్కులు నమోదు కాగా.. అధికారులు 39గేట్లు తెరిచారు. దిగువకు 2,88,778 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి వరద పోటెత్తుతున్నది. ఇన్‌ఫ్లో 2,75,218 క్యూసెక్కులు వస్తుండగా.. 10 గేట్ల ను 10 అడుగుల మేర ఎత్తి 2,79,830 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు వరద పోటెత్తుతున్నది. 2,57, 634 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండటం తో సాగర్‌డ్యామ్ 26 క్రస్ట్ గేట్లను ఎత్తి 2,10, 600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రసుత్తం పూర్తిస్థాయికి చేరుకున్నది.
హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం విక్రయాల్లో బ్లాక్ మార్కెటింగ్, దళారులను అరికట్టేందుకు మార్పులు చేసినట్టు ఆలయ అదనపు ఈవో వెంకయ్యచౌదరి తెలిపారు. ఇందులో భాగంగా దర్శనం టికెట్లు, టోకెన్లులేని భక్తులకు ఆధార్‌కార్డు నమోదుతో రెండు లడ్డూలు విక్రయించనున్నట్టు పేర్కొ న్నారు. దర్శన టికెట్, టోకెన్ కలిగిన భక్తులకు ఉచితంగా ఒక లడ్డూతోపాటు నాలుగు నుంచి ఆరు లడ్డూలు విక్రయిస్తామని, సామాన్య భక్తులకు మేలు చేసేలా లడ్డూల విక్రయ విధానం కొనసాగనున్నట్టు తెలిపారు.