బుధవారం 03 జూన్ 2020
Telangana - May 21, 2020 , 00:53:08

వలసదారుల్లో 89 మందికి కరోనా

వలసదారుల్లో 89 మందికి కరోనా

  • రాష్ట్రంలోకి వస్తున్నవారిపై ప్రత్యేక దృష్టి
  • కొత్తగా 27 మందికి వైరస్‌ పాజిటివ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణకు వచ్చినవారిలో ఇప్పటివరకు 89 మందికి కరోనా పాజిటివ్‌ రావడంతో కొత్తగా వస్తున్నవారిపై వైద్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇతర రాష్ర్టాల నుంచి వస్తున్నవారు తమ ఇండ్లకు చేరుకోకముందే స్క్రీనింగ్‌ టెస్టులు చేస్తూ అనుమానిత లక్షణాలున్నవారిని నిర్ధారణ పరీక్షల కో సం దవాఖానలకు తరలిస్తున్నది. రాష్ట్రంలో బుధవారం కొత్తగా 27 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 15 మంది, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చినవారు 12 మంది ఉండటం గమనార్హం. ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం గాంధీ దవాఖానలో 608 మంది చికిత్స పొందుతున్నట్టు ప్రజారోగ్యశాఖ తెలిపింది.


logo