హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వైద్యవిధాన పరిషత్తులో 268 మంది స్టాఫ్ నర్సులకు పదోన్నతులు కల్పించారు. మల్టీజోన్-1లో 173 మందికి, మల్టీజోన్-2లో 95 మందికి హెడ్ నర్సులుగా పదోన్నతులు కల్పిస్తూ టీవీవీపీ కమిషనర్ అజయ్‌కుమార్ జాబితా విడుదల చేశారు. ఎంపికైన అభ్యర్థులకు శనివారం ఉదయం హైదరాబాద్‌లోని డీఎంఈ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
అయితే సీనియార్టీ పాటించడం లేదంటూ 2011 బ్యాచ్‌కు చెందిన పలువురు కోర్టును ఆశ్రయించినట్టు అధికారులు చెప్తున్నారు. ఒకవేళ కోర్టు నుంచి ఆదేశాలు వస్తే ఆ సంవత్సరం బ్యాచ్‌కు చెందిన వారి పదోన్నతులను తాత్కాలికంగా నిలిపివేస్తామని పేర్కొన్నారు. 268 మందిలో 2011 బ్యాచ్‌కు చెందినవారు 26 మంది ఉన్నట్టు వెల్లడించారు.