నమస్తే తెలంగాణ నెట్వర్క్ : రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఎం డల ధాటికి తాళలేక జనాలు పిట్టల్లా రాలుతున్నారు. రాష్ట్రంలో శనివారం ఒక్కరోజే 26మంది వడదెబ్బకు మృత్యువాతపడ్డారు.
ఉమ్మడి వరంగల్లో 18, ఆదిలాబాద్లో నలుగురు, ఖమ్మంలో ముగ్గురు, కరీంనగర్ ఒక్కరు మృతిచెందారు. ఉష్ణోగ్రతలు గరిష్ఠం గా నమోదవుతున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.