Sankranthi | హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి పండుగ దృష్ట్యా ప్రయాణికుల కోసం దక్షిణమధ్య రైల్వే 26 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ నెల 10 నుంచి 17 వరకు ఈ రైళ్లను నడుపనున్నట్టు పేర్కొన్నారు. సికింద్రాబాద్-అర్సికిరే, విశాఖపట్నం-చర్లపల్లి, బెంగళూరు-కాలబురిగి మధ్య ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయని తెలిపారు.
హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి పండుగ నేపథ్యంలో 6,432 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్టు టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. ఈ నెల 10,11,12 తేదీల్లో ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనున్నది. తిరుగుప్రయాణం చేసే వారి కోసం ఈ నెల 19, 20 తేదీల్లో తగిన ఏర్పాట్లు చేసినట్టు ఎండీ సజ్జనార్ తెలిపారు. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్‌రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి నుంచి ప్రత్యేక బస్సులను నడుపనున్నామని పేర్కొన్నారు.
స్పెషల్ బస్సులు మినహా రెగ్యులర్ బస్సుల్లో సాధారణ చార్జీలే అమల్లో ఉంటాయని, మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ముందస్తు రిజర్వేషన్‌ను www.tgsrtcbus.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని, ప్రత్యేక బస్సుల పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ 040-69440000,040-23450033 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.