సంగారెడ్డి : కర్నాటక బస్సు లారీని ఢీ కొన్న ఘటనలో(Road accident) పలువురు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి జిల్లా(Sangareddy district) సదాశివపేట మండలం మద్దికుంట వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కర్నాటకు చెందిన ఆర్టీసీబస్సు(Karnataka bus) జహీరాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా అదుపుతప్పి వెనక నుంచి లారీని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో 30 మంది ప్రయాణికులు ఉండగా 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి(Passengers injured).
గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచరమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.