హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు రూ.25 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ జ్యోతి బుద్ధప్రకాశ్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. పరిషత్‌కు 2025-26 సంవత్సరానికి గాను బడ్జెట్లో రూ.100 కోట్లను కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించగా, త్రైమాసిక బడ్జెట్ నిధులను తాజాగా విడుదల చేశారు.
ఏడాదిన్నరగా బ్రాహ్మణ పరిషత్‌లో వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఈ నిధుల కోసమే ఎదురుచూస్తున్నారు. నిరుడు కూడా నిధులు వచ్చి మళ్లీ వెనక్కు మళ్లాయి. ఈసారి అలా జరగకుండా వెంటనే పథకాల లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసేలా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ చొరవ తీసుకోవాలని బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు కోరారు.