ప్రత్యేక తెలంగాణ వచ్చింది.. విద్యుత్తు వెలుగులు తెచ్చింది. కేవలం ఆరంటే ఆరు నెలల్లోనే గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు 24 గంటల నిరంతర, నాణ్యమైన విద్యుత్తును అందించి దేశమే ఆశ్చర్యపోయేలా చేశారు సీఎం కేసీఆర్. రాష్ట్రం ఏర్పడే నాటికి గ్రామాల్లో 12-16 గంటలు, మండల కేంద్రాల్లో 8-12 గంటలు, జిలా ్లకేంద్రాల్లో 6-10 గంటలు, రాష్ట్ర రాజధానిలో 4-6 గంటలపాటు విద్యుత్తు కోతలుండేవి. ఇక పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడేలు. వ్యవసాయానికి 3 గంటల విద్యుత్తు ఇస్తే అదో విశేషమే. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. దేశంలో నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే.