Rain: రాష్ట్రంలో వానలు (Rain) దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగి జనజీవనం స్తంభిస్తున్నది. మరో రెండు రోజులు కుంభవృష్టి కురుస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉన్నది. మల్కాజిగిరి, కూకట్పల్లి, కాప్రా, శేరిలింగపల్లిలో భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట, సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, బీఎన్‌రెడ్డి, హస్తినాపురం, సంతోశ్‌నగర్, దిల్సుఖ్నగర్, మలక్‌పేట, కోఠి, నాంపల్లి, అబిడ్స్, మెహిదీపట్నం, మాదాపూర్, గచ్చిబౌలిలో సోమవారం ఉదయం వరకు వర్షం కురుస్తూనే ఉన్నది.
అత్యధికంగా హైదర్‌నగర్‌లో 4.55 సెం.మీ. వర్షపాతం నమోదవగా, మల్కాజిగిరిలో 4.48 సెం.మీ., కూకట్‌పల్లిలో 4.35 సెం.మీ., కాప్రాలో 4.23 సెం.మీ., శేరిలింగపల్లిలో 4.23 సెం.మీ., కుత్బుల్లాపూర్‌లో 4 సెం.మీ., అల్వాల్‌లో 4 సెం.మీ., రామచంద్రాపురంలో 3.9 సెం.మీ., ఉప్పల్‌లో 3.78 సెం.మీ., ముషీరాబాద్‌లో 3.68 సెం.మీ., సేక్పేటలో 3.68 సెం.మీ., పటాన్చెరులో 3.65 సెం.మీ., ఖైరతాబాద్‌లో 3.6 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదయింది.
మరోవైపు కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట, సంగారెడ్డి, వరంగల్, యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా వరంగల్ జిల్లా గౌరారంలో 23.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ములుగులో 18.6 సెం.మీ., మెదక్ జిల్లా ఇస్లాంపూర్‌లో 18 సెం.మీ., తూప్రాన్‌లో 17.9 సెం.మీ., పిట్లం (కామారెడ్డి) 17.5 సెం.మీ., కౌడిపల్లి (మెదక్) 17.2 సెం.మీ., అడ్డగూడురు (యాదాద్రి) 16.4 సెం.మీ., హసన్‌పల్లె (కామారెడ్డి) 16.4 సెం.మీ., బేగంపేట (సిద్దిపేట) 16.3 సెం.మీ., దామరంచ (మెదక్) 16 సెం.మీ., మక్దుంపూర్ (కామారెడ్డి) 15.9 సెం.మీ., ములుగు (సిద్దిపేట) 15.8 సెం.మీ., మాసాయిపేట (మెదక్) 14.8 సెం.మీ., గుండాల (యాదాద్రి) 14.7 సెం.మీ., శివంపేట (మెదక్) 14.3 సెం.మీ., అంగడి కిష్టాపూర్ (సిద్దిపేట) 14.2 సెం.మీ., నస్రుల్లాబాద్ (కామారెడ్డి) 13 సెం.మీ., కుల్చారం (మెదక్) 13.7 సెం.మీ., రుద్రూరు (నిజామాబాద్) 13.4 సెం.మీ., నిజాంపేట (సంగారెడ్డి) 13 సెం.మీ., కల్లకల్ (మెదక్) 13 సెం.మీ., మర్యాల (యాదాద్రి) 12.9 సెం.మీ., కోటగిరి (నిజామాబాద్) 12.7 సెం.మీ., బోడగట్ (మెదక్) 12.6 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది.
కాగా, కామారెడ్డి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తున్నది. బీర్కూర్, పిట్లం మండలాల్లో ఏకధాటిగా వాన పడుతున్నది. పిట్లం మండలంలో కాగివాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఇరువైపులా ట్రాక్టర్లను అడ్డుపెట్టి పోలీసులు కాపాలాకాస్తున్నారు.
వణికిస్తున్న వరుస అల్పపీడనాలు.. వచ్చే మూడు రోజులు అత్యంత భారీ వర్ష సూచన
Newyork India Day Parade | పరేడ్‌లో జంటగా కనిపించిన విజయ్ దేవరకొండ- రష్మిక.. వీడియో వైరల్
Virushka | లండన్ వీధుల్లో సామాన్యుల్లా.. వీడియోకు చిక్కిన విరుష్క జంట