హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 15న మహాశివరాత్రి సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడుపనున్నట్టు టీజీఎస్ఆర్టీసీ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 2,243 ప్రత్యేక బస్సులను నడుపాలని నిర్ణయించినట్టు పేర్కొన్నది. 14 నుంచి 16 వరకు ఈ బస్సులు ఆయా రూట్లలో అందుబాటులో ఉంటాయని తెలిపింది. శ్రీశైలం(781), వేములవాడ(416), ఏడుపాయల(249), కీసరగుట్ట (326), వేలాల(127), కాళేశ్వరం(71)తో పాటు కొమురవెల్లి, అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప ఆలయాలకు 273 బ స్సులను ఏర్పాటు చేసినట్టు వివరించింది.
హైదరాబాద్లో ఎంజీబీఎస్, జేబీఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్బీ, బీహెచ్ఈఎల్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్ర త్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను సవరించినట్టు పేర్కొన్నది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులకు ముంద స్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించినట్టు వెల్లడించింది. టికెట్ల బుకింగ్ కోసం www.tgsrtcbus.in వెబ్సైట్ను, బస్సుల సమాచారం కోసం 040-69440000, 234500332 నంబర్లలో సంప్రదించాలని కోరింది.