చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Chevella Bus Accident)లో 21 మంది మృతిచెందారు. సోమవారం ఉదయం 5 గంటలకు తాండూరు డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు 30 మంది ప్రయాణికులతో తాండూరు నుంచి హైదరాబాద్కు బయల్దేరింది. ఉదయం 7.05 గంటల సమయంలో చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఎదురుగా వచ్చిన టిప్పర్.. బస్సును ఢీకొట్టింది. దీంతో ఇద్దరు డ్రైవర్లు సహా 21 మంది మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం సమాయంలో బస్సులో 70 మంది ఉన్నారు. మృతుల్లో ఎక్కువ మంది తాండూరు, చేవెళ్లకు చెందినవారే ఉన్నారు.
ప్రమాదం ధాటికి బస్సు కుడి వైపు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. బస్సు డ్రైవర్ వెనుక ఉన్న 8 సీట్లు ధ్వంసమయ్యాయి. డిప్పర్ పడిపోవడంతో అందులో ఉన్న కంకర బస్సులో పడిపోయింది. దీంతో డ్రైవర్ వెనక 8 సీట్లలో కూర్చుకున్న ప్రయాణికులు కంకరలో చిక్కుకుపోయారు. దీంతో వారంతా అక్కడికక్కడే మరణించారు. వెనక సీట్లలో ఉన్న స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇక బస్సు కండక్టర్తోపాటు, ఎడమ వైపు ముందు సీట్లలో కూర్చుకున్న వారిపై కంకర పడిండిది. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు.

కాగా, ఉదయం 7.05 గంటలకు యాక్సిడెంట్ జరిగిందని తాండూరు డిపో మేనేజర్ తెలిపారు. టిప్పర్లో సుమారు 50 టన్నుల కంకర ఉన్నదని చెప్పారు. గంతను తప్పించబోయి టిప్పర్ బస్సుని ఢీకొట్టిందని వెల్లడించారు. బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బాధితులకు సంబంధించి సమాచారం కోసం 99129 19545, 94408 54433 నంబర్లలో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

మృతుల వివరాలు..

గాయపడిన వారు..
