హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): ప్రజాభవన్లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 2,095 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. రెవెన్యూ సంబంధ సమస్యలపై 458 దరఖాస్తులు, రేషన్ కార్డుల కోసం 134, ఇందిరమ్మ ఇండ్ల కోసం 552 దరఖాస్తులు, మైనార్టీ సంక్షేమ శాఖకు సంబంధించి 333 దరఖాస్తులు ఉన్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రజావాణి ప్రత్యేక అధికారి దివ్య, ఇతర అధికారులు దరఖాస్తులను స్వీకరించినట్టు చెప్పారు.