హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ వార్షిక పరీక్షల్లో సోమవారం ఒకే రోజు 20,540 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. సోమవారం ఫస్టియర్ విద్యార్థులకు ఫిజిక్స్, ఎకనామిక్స్ పేపర్లకు పరీక్షలు నిర్వహించారు.
5,41,143 మంది విద్యార్థులకు 5,20,603 మంది పరీక్షకు హాజరైనట్టు అధికారులు తెలిపారు. సోమవారం 10 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జనగాంలో 6, సూర్యాపేటలో 2, నిజామాబాద్, నల్లగొండల్లో ఒకరు చొప్పున విద్యార్థులు డిబార్ అయ్యారు.