హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ఎమర్జెన్సీ సేవలను మరింత పటిష్ఠం చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం 466 వాహనాలను ప్రారంభించనున్నారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 204 అంబులెన్స్‌లు (108), 228 అమ్మఒడి వాహనాలు, 34 హర్సె వెహికిల్స్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ జెండా ఊపి ప్రారంభి స్తారని వెల్లడించారు. నూతన వాహనాలతో ప్రజలకు వైద్యసేవలు మరింత వేగంగా అందుబాటులోకి వస్తాయని ట్వీట్ చేశారు.