గురువారం 25 ఫిబ్రవరి 2021
Telangana - Jan 25, 2021 , 01:56:53

సీఎం చొరవతో బీసీల్లోకి చిట్టెపురెడ్డిలు

సీఎం చొరవతో బీసీల్లోకి చిట్టెపురెడ్డిలు

  • ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

నిజాంసాగర్‌/పిట్లం, జనవరి 24: చిట్టెపురెడ్డిలను బీసీ-డీలోకి చేర్చాలన్న మూడు దశాబ్దాల కల నేడు సీఎం కేసీఆర్‌ చొరవతో సాకారమైందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా పిట్లంలో నిర్వహించిన కుల్లకడగి, కుల్లెకడిగి, చిట్టెపురెడ్డిల రాష్ట్రస్థాయి ఆత్మీయ సమ్మేళనం, కృతజ్ఞత సభకు కవిత ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు.  టీఆర్‌ఎస్‌ మాట ఇస్తే తప్పదన్నారు. ఆయా కులాలను బీసీల్లో చేర్చాలన్న కోరికను కేశవరావు కమిషన్‌ ద్వారా నెరవేర్చిందని స్పష్టంచేశారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ చెప్పినట్టుగా అన్ని పనులు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని వెల్లడించారు. ఎన్నికల కోసం కాదు.. తరాల కోసం పనిచేయాలని ఎప్పుడు కేసీఆర్‌ చెబుతారని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ బీబీపాటిల్‌, జెడ్పీ చైర్మన్‌ దఫేదార్‌ శోభరాజు, డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, కామారెడ్డి, నిజామాబాద్‌, నిర్మల్‌, అదిలాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలకు చెందిన చిట్టెపురెడ్డి ప్రతినిధులు హాజరయ్యారు. 


VIDEOS

logo