బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Sep 25, 2020 , 13:03:37

సమరోత్సాహంతో అన్నదాతలు..ఎడ్లబండ్లు, ట్రాక్లర్లతో భారీ ర్యాలీలు

సమరోత్సాహంతో అన్నదాతలు..ఎడ్లబండ్లు, ట్రాక్లర్లతో భారీ ర్యాలీలు

హైదరాబాద్ : నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా సమరోత్సాహంతో అన్నదాతలు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీలు నిర్వహిస్తూ సీఎం కేసీఆర్ కు మద్దతు తెలుపుతున్నారు. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామం నుంచి రాయపర్తి మండల కేంద్రం వరకు  1000 ట్రాక్టర్లు, 500 ఎడ్లబండ్లతో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ట్రాక్టర్ నడిపి రైతులను ఉత్సాహ పరిచారు.

వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ లో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్రాక్టర్ల ర్యాలీని ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ లో పాల్గొన్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ట్రాక్టర్ల ర్యాలీని ప్రారంభించారు. అలాగే పలు జిల్లాల్లో రైతులు స్వచ్ఛందంగా ర్యాలీలు నిర్వహిస్తూ సంబురాలు జరుపుకుంటున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తూ కృతజ్ఞతను చాటుతున్నారు.


వికారాబాద్ జిల్లాలో..

కరీంనగ్ జిల్లాలో..

 కొత్తగూడెం జిల్లాలో..

సిరిసిల్ల జిల్లాలో..